For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర పెరిగింది, వెండి ధర తగ్గింది: ఎందుకంటే?

|

ముంబై: బంగారం, వెండి ధరలు ఈరోజు(సెప్టెంబర్ 18) పెరిగాయి. డొమెస్టిక్ గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ శుక్రవారం స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అయిదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మరోవైపు, సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ క్షీణించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. బంగారంపై ఈ ప్రభావం పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో పసిడి ధరలు గత మార్చి నుండి ఆగస్ట్ మిడిల్ వరకు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తగ్గాయి. నెల రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి.

పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర

పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రానికి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.173 (0.34 శాతం) పెరిగి రూ.51,626 పలికింది. వెండి ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా రూ.192 (0.28 శాతం) తగ్గి కిలో రూ.67,950 పలికింది. ఉదయం ప్రారంభంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,571 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.4 శాతం పెరిగి రూ.68,405 పలికింది. సాయంత్రానికి బంగారం మరింతగా పెరిగింది. వెండి మాత్రం క్షీణించింది. అంతకుముందు సెషన్‌లో పసిడి, వెండి ధరలు క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు రూ.56,200 పలికింది. ఆ ధరతో ఇప్పటికీ రూ.రూ.4,500 కంటే పైన తక్కువగా ఉంది.

బంగారం పెరిగింది, వెండి పైకి, కిందకు..

బంగారం పెరిగింది, వెండి పైకి, కిందకు..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ 0.73 శాతం పెరిగి ఔన్స్ 1,964.10 పలికింది. సిల్వర్ లాభనష్టాల మధ్య తచ్చాడింది. ఔన్స్ 26.87 డాలర్ల నుండి 27.58 మధ్య పైకి, కిందకు కదిలింది. అంతకుముందు సెషన్‌లో వెండి ఔన్స్ 27.10 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ 0.21 శాతం మేర క్షీణించింది.

బులియన్ మార్కెట్‌లో ధర

బులియన్ మార్కెట్‌లో ధర

దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 10 గ్రాములు రూ.225 పెరిగి రూ.52,672 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి రూ.52,448 వద్ద క్లోజ్ అయిది. వెండి కిలో రూ.620 పెరిగి రూ.69,840 పలికింది. అంతకుముందు సెషన్‌లో రూ.69,221 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.53,550, 22 క్యారెట్ల బంగారం రూ.49,090 పలికింది.

పెట్రోల్, డీజిల్, చమురు ధరలు, డాలర్‌తో రూపాయి

పెట్రోల్, డీజిల్, చమురు ధరలు, డాలర్‌తో రూపాయి

- ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన నగరాల్లో ఇలా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.14, డీజిల్ రూ.72.02, కోల్‌కతాలో పెట్రోల్ రూ.82.67, డీజిల్ రూ.75.52, ముంబైలో పెట్రోల్ రూ.87.82, డీజిల్ రూ.78.48, చెన్నైలో

పెట్రోల్ రూ.84.21, డీజిల్ రూ.77.40, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.84.33, డీజిల్ రూ.78.50గా ఉంది.

- చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ 20 సెంట్లు క్షీణించి బ్యారెల్ 43.10 డాలర్లు, యూఎస్ ఆయిల్ ఫ్యూచర్స్ 40.77 డాలర్లు పలికింది.

- డాలర్ మారకంతో రూపాయి 21 పైసలు బలపడి 73.45 వద్ద క్లోజ్ అయింది.

- సెన్సెక్స్ 134 పాయింట్లు బలహీనపడి 38,845.82 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 11,504.95 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

English summary

బంగారం ధర పెరిగింది, వెండి ధర తగ్గింది: ఎందుకంటే? | Gold, Silver Price Today: Yellow metal futures edge higher to Rs 51,626

Domestic gold and silver futures moved in a narrow range on Friday, as optimism on a global recovery from the coronavirus pandemic was offset by weakness in the dollar weighed.
Story first published: Friday, September 18, 2020, 22:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X