ద్రవ్యోల్భణం ఎఫెక్ట్, పెరిగిన బంగారం ధరలు: రూ.45,000 దిగువనే పసిడి
ముంబై: బంగారం ధరలు నేడు (మార్చి 15, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.45,450 స్థాయిని అధిగమిస్తే రూ.45,880 వరకు వెళ్ళి, అక్కడ సానుకూలంగా కనిపించవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్ మే కిలో రూ.66,045 స్థాయిని నిలబెట్టుకుంటే రూ.65,340 స్థాయికి పడిపోవచ్చునని, రూ.67,470 స్థాయిని అధిగమిస్తే మాత్రం రూ.68,900 వరకు పెరగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ప్యాకేజీ నేపథ్యంలో ద్రవ్యోల్భణ వర్రీస్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

బంగారం స్వల్పంగా పెరుగుదల
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.134.00 (0.30%) పెరిగి రూ.44884.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,790.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,964.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,790.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,000కు పైగా తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.128.00 (0.28%) పెరిగి రూ.45235.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,272.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,312.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,230.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా జంప్
వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.386.00 (0.58%) పెరిగి రూ.67230.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,226.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,360.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,196.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.419.00 (0.62%) పెరిగి రూ.68291.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,408.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,280.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 1700 డాలర్ల పైనే ఉంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.60 (0.27%) డాలర్లు తగ్గి 1,724.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,722.70 - 1,732.55
డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైనే ఉంది. ఔన్స్ ధర 0.114 (+0.44%) డాలర్లు పెరిగి 26.025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.985 - 26.265 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications