బంగారం ధరలు నేడు పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చెంజ్(MCX)లో పసిడి ధరలు రూ.51,600 క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం సెషన్‌లో 1925 డాలర్ల దిగువన ముగిసినప్పటికీ, నేడు ఈ మార్కు పైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 66,500 దిగువన ట్రేడ్ అవుతోంది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 24.500 డాలర్ల దిగువనే ఉంది.
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్ సమయానికి 249 పెరిగి రూ.51,620 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.198 పెరిగి రూ.51,819 వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ప్రస్తుతం రూ.4600 వరకు తక్కువగా ఉంది.
ఇక మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.23 పెరిగి రూ.66,328 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.27 ఎగిసి రూ.67,119 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.14000 వరకు తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వార్త రాసే సమయానికి 2.30 డాలర్లు ఎగిసి 1925 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.031 డాలర్లు క్షీణించి 24.422 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1923 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 9.78 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 24.458 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 3.12 శాతం క్షీణించింది.
రష్యా పైన మరిన్ని ఆంక్షల ఆందోళనలు, చమురు ధరలు మళ్లీ పెరుగుతుండటం, యుద్ధం కారణంగా బ్లాక్ సీ ప్రాంతంలో గ్రెయిన్ పోర్ట్‌ను మూసివేయడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌తో పాటు పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు ఈ వారం రూ.51,200 నుండి రూ.52,000 స్థాయిలో కొనసాగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications