For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: బంగారం ధరలు భారీగా తగ్గి, స్వల్పంగా పెరిగాయి

|

నిన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు (ఏప్రిల్ 29, శుక్ర వారం) మళ్లీ పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో రూ.51,000 దిగువకు పడిపోయినప్పటికీ, మళ్లీ పెరుగుతోంది. నేడు ఉదయం గం.9.50 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.349 పెరిగి రూ.51,611 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.351 పెరిగి రూ.51,890 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మే రూ.313 పెరిగి రూ.64,230 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.301 పెరిగి రూ.64,881 వద్ద ట్రేడ్ అయింది.

గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.4600 తక్కువగా ఉంది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా తగ్గింది. నిన్న జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8 తగ్గి రూ.51,254 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.29 తగ్గి రూ.51,510 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం దాదాపు స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,950 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64,530 వద్ద ట్రేడ్ అయింది.

Gold rises above Rs 51000, silver gives up Rs 65000

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1900 డాలర్ల దిగువకు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఈ మార్కు క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ (జూన్ 22) నేటి సెషన్‌లో ఏకంగా 15 డాలర్లు పెరిగి 1906 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.147 డాలర్లు పెరిగి 23.333 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ క్రితం సెషన్‌లో ఏకంగా 1891 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

Gold Prices Today: బంగారం ధరలు భారీగా తగ్గి, స్వల్పంగా పెరిగాయి | Gold rises above Rs 51000, silver gives up Rs 65000

Gold prices were trading over half a per cent down in India on Thursday, mirroring global trends, where yellow metal hovered near a two-month low.
Story first published: Friday, April 29, 2022, 10:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X