ముంబై: బంగారం ధరలు 2020లో ఇప్పటి వరకు 28 శాతానికి పైగా పెరిగాయి. గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా పసిడి ధరలు వేగంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా, లాక్ డౌన్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో 1400 స్థాయిలో ఉన్న ఔన్స్ పసిడి 2072 డాలర్లను తాకింది. అయితే ఇప్పుడు 1900 డాలర్లకు సమీపంలో ఉంది. దేశీయ మార్కెట్లో రూ.40వేల లోపు ఉన్న పసిడి, రూ.56వేలను కూడా దాటింది. ఇప్పుడు రూ.50వేల స్థాయిలో కదలాడుతోంది. 2020లో ఇప్పటి వరకు బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 23 శాతం, ఇండియాలో 28 శాతం పెరిగింది. 2019లో కూడా బంగారం డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు మరోసారి అదే బాటలో నడిచింది.

10 శాతం తగ్గింది...
ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో పసిడి ధరలు సాధారణ పెరుగుదలను నమోదు చేశాయి. అయితే కరోనా వల్ల వివిధ దేశాలు లాక్ డౌన్ విధించడంతో, ఆంక్షలు విధించడంతో క్రమంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. అలా చూస్తే బంగారం దాదాపు 40 శాతం పెరిగింది. అయితే వ్యాక్సీన్ ప్రకటనల నేపథ్యంలో ఆగస్ట్ నుండి 10 శాతం మేర ధరలు క్షీణించాయి. దీంతో పెరుగుదల 28 శాతం వరకు ఉంది.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నిన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. వెండి కూడా అదే బాటలో నడిచింది. కొత్త వైరస్ ఆందోళన నేపథ్యంలో నిన్న రూ.50,000కు పైకి చేరుకొని, రూ.51,000 దిశగా వెళ్లింది. అయితే ఆ తర్వాత తగ్గింది అయితే నిన్న స్వల్ప పెరుగుదలతో ముగిసింది. నేడు (డిసెంబర్ 22, మంగళవారం) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.442.00 (-0.88%) క్షీణించి రూ.49974.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,527.00 ప్రారంభమై, రూ.50,540.00 గరిష్టాన్ని, రూ.49,960.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.437.00 (-0.87%) తగ్గి రూ.50020.00 వద్ద కట్రేడ్ అయింది. రూ.50,500.00 ప్రారంభమై, రూ.50,555.00 గరిష్టాన్ని, రూ.50,020.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కిలో రూ.1,947.00 (-2.82%) తగ్గి రూ.67071.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,797.00 ప్రారంభమై, రూ.69,797.00 గరిష్టాన్ని, రూ.66,849.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్ రూ.1,975.00 (-2.82%) తగ్గి రూ.67999.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,494.00 ప్రారంభమై, రూ.70,574.00 గరిష్టాన్ని, రూ.67,773.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగానే తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 15.20 (-0.81%) డాలర్లు క్షీణించి 1,867.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,865.10 - 1,889.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.762 (-2.89%) క్షీణించి 25.617 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.508 - 26.812 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!



Click it and Unblock the Notifications