మళ్లీ పెరిగిన బంగారం ధరలు, రూ.49,000 దిగువనే: వెండి రూ.2,000కు పైగా జంప్
ముంబై: బంగారం ధరలు నేడు(జనవరి 29, శుక్రవారం ) స్వల్పంగా పెరిగాయి. కొద్దిరోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు నిన్న ప్రారంభ సెషన్లోను పెరిగినప్పటికీ, చివరకు తగ్గాయి. నేడు కూడా ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రూ.రూ.49,000కు దిగువనే ఉంది. కొద్ది రోజులుగా పసిడి ధరలు యాభై వేల రూపాయల వద్దే కదలాడుతోంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.7500కు పైగా తక్కువగా ఉంది. నిన్న ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.241 తగ్గి రూ.48,624 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.131 క్షీణించి రూ.48,985 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.1,204 పెరిగి రూ.67,740 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.1,235 పెరిగి రూ.68,665 వద్ద ముగిసింది.

49,000కు దిగువనే పసిడి
నేడు ఉదయం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 145.00 (0.30%) పెరిగి రూ.48,769.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,624.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,783.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,624.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7500కు పైగా తక్కువ ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 72.00 (-0.15%) పెరిగి రూ.49,008.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,050.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,085.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,992.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.850 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. కిలో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 850.00 (1.26%) పెరిగి రూ.68445.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,641.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,769.00 వద్దనే గరిష్టాన్ని, రూ.68,353.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి రంెడు రోజుల్లో రూ.2వేలకు పైగా పెరిగింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.838.00 (1.22%) పెరిగి రూ.69400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,628.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,628.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1860 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.80 (+0.15%) డాలర్లు పెరిగి 1,844.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,841.15 - 1,847.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.51% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.318 (+1.23%) డాలర్లు తగ్గి 26.240 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.152 - 26.668 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.55శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications