బడ్జెట్ ఎఫెక్ట్: వరుసగా నాల్గవ రోజు తగ్గిన బంగారం ధరలు, 10గ్రా. పసిడి ఎంతంటే..?
హైదరాబాదు: బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటినుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా పడిపోయిన పసిడి ధరలు గురువారం రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా పడిపోయాయి.ఎంసీఎక్స్ పై రూ.440 తగ్గి రూ.48,820గా బంగారం ధర ఉంది. ఇక వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.44,750గా ఉండగా అదే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 48,820 వద్ద ఉంది.ఇక కాస్మోపాలిటన్ నగరం హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.44,750గా ఉండగా అదే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 48,820 వద్ద ఉంది. అంటే బెంగళూరు హైదరాబాదు నగరాల్లో ఒకే విధమైన రేటు ఉన్నట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గగా, అదే 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గింది.

విశాఖ నగరంలో కూడా అదే బంగారం అదే ధర ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.44,750గా ఉండగా అదే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 48,820 వద్ద ఉంది. ఇక వెండి ధరలు కూడా పడిపోయాయి. కిలో వెండి ధర రూ.1955 మేరా తగ్గి రూ.67,605కు చేరుకుంది. ఇక రేపటికి అంటే ఫిబ్రవరి 5వ తేదీ నాటికి బంగారం ధర రూ.47725 నుంచి రూ.47,955 మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రూ. 1000 పెరిగి రూ. 68,616 వద్ద ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా పెరిగాయి. ఔన్స్‌కు 1,844.48 డాలర్లుగా అక్కడ ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర ఔన్స్‌కు 26.78 డాలర్లు వద్ద క్లోజ్ అయ్యింది.


Click it and Unblock the Notifications