బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, ఈ కాలంలో రూ.3500 తగ్గాయి
బంగారం ధరలు క్రితం సెషన్‌లో భారీగా పెరిగాయి. ఈ వారం పసిడి ధరలు రూ.51,000 నుండి రూ.52,000 మధ్య కదలాడుతున్నాయి. రూ.400 నుండి రూ.600 వరకు పెరుగుతూ, మరోసారి అంతేస్థాయిలో తగ్గుతూ పైకి కిందకు కదులుతున్నాయి. క్రితం సెషన్‌లోను ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.68,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1950 డాలర్లను సమీపించింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.401 పెరిగి రూ.51,780 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 398 లాభపడి రూ.52,105 వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు కూడా స్వల్పంగా పెరిగింది. ఉదయం సెషన్‌లో ఎప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.63 ఎగిసి రూ.51,830 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.61 ఎగిసి రూ.52,190 వద్ద ప్రారంభమైంది. సిల్వర్ ఫ్యూచర్స్ మే రూ.86 లాభపడి రూ.68,350 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.69,029 వద్ద ముగిసింది. పసిడి ధరలు నెల రోజుల గరిష్టం నుండి రూ.3500 తక్కువగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో రూ.1941.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1937.3 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 1,940.25 - 1,949.20 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు 25.233 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 25.212 - 25.438 డాలర్ల మధ్య కదలాడింది. క్రితం సెషన్లో 25.189 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications