Gold rate today: బంగారం ధరలు తగ్గుతున్నాయి
నిన్న ప్రారంభ సెషన్‌లో రూ.51,000 దాటిన పసిడి ధరలు, ఆ తర్వాత స్వల్పంగా తగ్గి ఈ మార్కుకు దిగువనే ముగిశాయి. నేడు (మార్చి 31, గురువారం) కూడా పసిడి ధరలు దాదాపు స్థిరంగా లేదా స్వల్ప తగ్గుదలతో ఉన్నాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.42 లేదా 0.08 శాతం క్షీణించి రూ.50,911 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.232 క్షీణించి రూ.51,544 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.736 తగ్గి రూ.66,670 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.670 క్షీణించి రూ.67,450 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోను పసిడి ధరలు క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 9 డాలర్లు లేదా 0.47 శాతం క్షీణించి 1924 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.380 డాలర్లు లేదా 1.51 శాతం క్షీణించి 24.733 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1933.50 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 25.113 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,924.25 - 1,933.50 డాలర్ల మధ్య, సిల్వర్ ఫ్యూచర్స్ 21.410 - 28.920 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5300, ఇటీవలి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాటి గరిష్టంతో పోలిస్తే రూ.4500కు పైగా తక్కువగా ఉంది. పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ స్పాట్ గోల్డ్ మద్దతు ధర 1910 డాలర్లు, నిరోధకస్థాయి 1940 డాలర్ల వద్ద కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ మద్దతు ధర 51,500, నిరోధకస్థాయి 52,100 వద్ద కనిపిస్తోందని అంటున్నారు. బంగారం ధరలు మార్చి 7వ తేదీ నుండి రూ.2000కు పైగా, వెండి రూ.4000 వరకు తగ్గింది.


Click it and Unblock the Notifications