Gold Price Today: బడ్జెట్‌కు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ముంబై: కేంద్ర బడ్జెట్‌కు ముందు బంగారం ధరలు షాకిచ్చాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నిన్న 10 గ్రాముల పసిడి దాదాపు రూ.500 పెరిగింది. గత కొద్దిరోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు రెండు రోజుల క్రితం పెరిగే సంకేతాలు ఇచ్చి, చివరకు తగ్గాయి. నేడు మాత్రం ఎగిశాయి. బంగారం రూ.49,000 మార్కును దాటింది. ఇటీవల పసిడి ధరలు యాభై వేల రూపాయల వద్ద కదలాడుతున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7100 వరకు తక్కువగా ఉంది. వెండి ఏకంగా రూ.2,000కు పైగా పెరిగింది.

49,000కు పైకి పసిడి
నిన్న ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 482.00 (0.99%) పెరిగి రూ.49,106.00 వద్ద ముగిసింది. రూ.48,624.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,485.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,624.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7100కు పైగా తక్కువ ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 394.00 (0.81%) పెరిగి రూ.49,330.00 వద్ద ముగిసింది. రూ.49,050.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,831.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,992.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.2000 జంప్
వెండి భారీగా షాకిచ్చింది. ఏకంగా రూ.2170 పెరిగింది. ఓ సమయంలో రూ.71,000 క్రాస్ చేసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 2,170.00 (3.21%) పెరిగి రూ.69765.00 వద్ద ముగిసింది. రూ.68,641.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,290.00 వద్దనే గరిష్టాన్ని, రూ.68,353.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి మూడు రోజుల్లో రూ.4వేలకు పైగా పెరిగింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.2,338.00 (3.41%) పెరిగి రూ.70900.00 వద్ద ముగిసింది. రూ.69,628.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,234.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,332.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నిన్న ఓ సమయంలో 1860 డాలర్ల పైకి చేరినప్పటికీ, చివరకు 1850 డాలర్ల దిగువ ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ మొదట్లో 40 డాలర్ల వరకు పెరిగింది. కానీ 8 డాలర్ల పెరుగుదలతో ముగిసింది. నిన్నటి సెషన్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 8.40 (+0.46%) పెరిగి 1,849.60 డాలర్ల వద్ద ముగిసింది. ఆ సెషన్లో 1,841.15 - 1,878.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.83% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 1.138 (+4.39%) డాలర్లు పెరిగి 27.060 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.152 - 27.765 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.12శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications