గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్, పెరిగిన బంగారం ధరలు: ఇక్కడ రూ.47,500 దిశగా.. అక్కడ రూ.1800 క్రాస్
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పెరుగుతున్నాయి. అంతకుముందు వారం రూ.47,000 దిగువన ట్రేడ్ అయిన ఫ్యూచర్ గోల్డ్ ఇప్పుడు రూ.47,300 దాటింది. నిన్న స్వల్పంగా రూ.50 పెరిగింది. వెండి ధరలు కూడా ఈ నెలలో పెరిగి, రూ.70,000 దాటాయి. నిన్న స్వల్పంగా తగ్గినప్పటికీ, డెబ్బై వేల రూపాయల పైనే ఉంది. డాలర్ వ్యాల్యూ పడిపోవడం, కోవిడ్ 19 వేరియంట్ భయాందోళనలు పసిడిపై ప్రభావం చూపాయి.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నిన్న 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50.00 (0.11%) పెరిగి రూ.47335.00 ముగిసింది. నిన్న ఓ సమయంలో రూ.47,425 దాటి రూ.47,500 దిశగా కనిపించింది. చివరకు రూ.47,400 దిగువన ముగిసింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,600 వద్ద ముగిసింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.123.00 (-0.18%) క్షీణించి రూ.70065.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.191.00 (-0.27%) తగ్గి రూ.71391.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లకు చేరువలో ఉంది. నేడు ఏకంగా 16 డాలర్ల మేర పెరిగి 1799 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 1800 డాలర్లను క్రాస్ చేసినప్పటికీ, ఆ తర్వాత ఒకటి రెండు డాలర్లు తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 27 డాలర్ల దిశగా సాగుతోంది. నేడు 0.211 శాతం ఎగిసి 26.712 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications