Gold Rates: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరల్లో నేడు పెద్దగా మార్పులేదు. నిన్న (మార్చి 10) అతి స్వల్పంగా మాత్రమే తగ్గింది. ఫ్యూచర్ మార్కెట్లో ఇప్పటికీ రూ.48,000 దిగువనే ఉంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.11,400 తక్కువగా ఉంది. రెండు రోజుల క్రితం భారీగా పెరిగిన పసిడి ధరలు నిన్న దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు కూడా అదే ఒరవడి కొనసాగుతోంది. ముంబై రిటైల్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.43,430, 24 క్యారెట్ల పసిడి రూ.44,430, ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.43,950, 24 క్యారెట్ల పసిడి రూ.47,950గా ఉంది.

స్థిరంగా బంగారం ధరలు
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నిన్న ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.58.00 (0.13%) తగ్గి రూ.44799.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,730.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,944.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,630.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.18.00 (-0.04%) తగ్గి రూ.45090.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,966.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,258.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,920.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్థిరంగా
వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.50.00 (-0.07%) తగ్గి రూ.67430.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,951.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,522.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.50.00 (-0.07%) తగ్గి రూ.67430.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,951.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,522.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 1750 డాలర్ల దిశగా వెళ్లింది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 10.70 (+0.62%) డాలర్లు తగ్గి 1,732.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,721.70 - 1,732.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైకి చేరుకుంది. ఔన్స్ ధర 0.295 (+1.13%) డాలర్లు పెరిగి 26.433 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.102 - 26.405 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications