Gold rates: మళ్ళీ రివర్స్ .. పైపైకి బంగారం ధరలు: నేడు తెలుగురాష్ట్రాల్లో పసిడి ధరలిలా!!
బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. మళ్లీ ధరలు స్వల్పంగా పెరుగుతుండడంతో ఒకవేళ బంగారం కొనాలంటే ఇప్పుడే కొనుక్కోమని చెప్తున్నారు నిపుణులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు మళ్ళీ ఐదు రోజులుగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కిందికి చూస్తున్నాయి అనుకున్న బంగారం ధరలు మళ్లీ రివర్స్ అయి పైపైకి ఎగబాకుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే చేసుకోవచ్చని మరింత రేటు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బంగారం ధరల దూకుడు .. అంతర్జాతీయంగా బంగారం ధరలిలా
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలలో దూకుడు కనిపిస్తుంది. గత మూడు రోజుల నుంచి చూసుకుంటే 10 గ్రాముల బంగారంపై 400 రూపాయలు మేర బంగారం ధర పెరిగింది. నిన్న భారీగా పెరిగిన వెండి నేడు కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను చూస్తే నేడు అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు 1838 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. స్పాట్ వెండి ధర ఔన్స్ కు 20.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలిలా
ఇక దేశీయంగా బంగారం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర నేడు 51,750 గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,450 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మీద నిన్నటితో పోలిస్తే 150 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర మీద నిన్నటితో పోలిస్తే 160 రూపాయల మేర ధర పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో చూసినట్లయితే బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51,750గా ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 56,450గా కొనసాగుతుంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో బంగారం ధరలిలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 51 వేల 900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 బంగారం ధర 56,600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,750 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56వేల 450 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 800 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,500 రూపాయలుగా కొనసాగుతుంది.

నేడు కాస్త తగ్గిన వెండి ధరలు
ఇక వెండి ధరల విషయానికి వస్తే గత రెండు రోజులుగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 70 వేల రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీలో వెండి ధర దేశంలోనే అన్ని ప్రాంతాల కంటే తక్కువగా ఉంది. నేడు ఢిల్లీలో వెండి ధర 66,500 వద్ద ట్రేడ్ అవుతుంది. ఏది ఏమైనా పెరుగుతున్న బంగారం ధరలు మళ్లీ బంగారం కొండెక్కి కూర్చుంటుంది అన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకోమని అంటున్నారు నిపుణులు.


Click it and Unblock the Notifications