Gold rate today: స్థిరంగా రూ.51,000 స్థాయిలోనే బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల లేదా పెరుగుదలతో గత కొద్ది రోజులుగా దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతవారం నుండి గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.51,000 స్థాయిలోనే కదలాడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే పసిడి ధరలు రూ.5100 వరకు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో కూడా 1850 డాలర్ల నుండి 1860 డాలర్ల మధ్య కదలాడుతోంది.
నేడు (జూన్ 9, 2022) ప్రారంభ సెషన్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.37 పెరిగి రూ.51,088 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.19 పెరిగి రూ.51,330 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.144 పెరిగి రూ.62,170 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.169 పెరిగి రూ.62,904 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.62,000 క్రాస్ చేసింది.

కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 0.40 డాలర్లు లేదా 0.02 శాతం క్షీణించి 1856 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.043 డాలర్లు లేదా 22.137 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1855 డాలర్ల దిగువన ముగిసింది. ఏడాదిలో 2.65 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 22.094 డాలర్ల ముగియగా, ఏడాదిలో 20.46 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications