రూ.51,000 సమీపంలో... భారీగా పెరిగిన బంగారం ధర, కిలో వెండి రూ.1,200కు పైగా జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు శుక్రవారం (అక్టోబర్ 9) భారీగా పెరిగాయి. 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ సాయంత్రం సమయానికి రూ.663(1.32 శాతం) పెరిగి రూ.50,838 పలికింది. పసిడి ఉదయం 50,300 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నేటి కనిష్టం అదే. అంతకంటే క్షీణించలేదు. రూ.50,970 గరిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ రూ.51,000ను తాకింది. కిలో వెండి రూ.1,230 పెరిగి 61,750 మార్క్ చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 1.65 శాతం లాభపడి 1,926 డాలర్లను తాకింది. రాత్రి గం.9.30 సమయం వరకు కామెక్స్‌లో 1,898.10 డాలర్ల నుండి 1,935.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. నిన్న 1,895 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 1,898 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

అనిశ్చితిలో పడిన కరోనా ఆర్థిక ప్యాకేజీపై చర్చలు తిరిగి ప్రారంభం కావడంతో అమెరికా స్టాక్స్ బలపడ్డాయి. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ బలహీనపడింది. డాలర్ సూచీ 0.2 శాతం క్షీణించింది. ఎన్నికలు ముగిసే వరకు ప్యాకేజీపై చర్చలు లేవని తొలుత ప్రకటించిన అధ్యక్షులు ట్రంప్ ఆ తర్వాత చర్చకు మొగ్గు చూపారు. దీంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications