బంగారం ధరలు నేడు (మే7, శుక్రవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ధరలు గురువారం భారీగా పెరిగాయి. అంతకుముందు తగ్గినట్లే కనిపించి, అంతలోనే ఎగిసిపడ్డాయి. పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,500 దాటి రూ.48,000 దిశగా పరుగులు పెట్టింది. నిన్న వెండి ఏకంగా రూ.2000కు పైగా పెరిగి రూ.71,000 కూడా దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగా ఎగిశాయి. 1820 డాలర్లు క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 27.500 డాలర్ల వద్ద కదలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు ఆచితూచి వ్యవహరిస్తుండటం పసిడికి కలిసి వస్తోంది. దేశీయంగా ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం రూ.8500 తక్కువగా ఉంది.

భారీగా పెరిగిన తర్వాత దాదాపు స్థిరంగా
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.85.00 (0.18%) పెరిగి రూ.47680.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,654.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,770.00 గరిష్టాన్ని, రూ.47,619.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.85.00 (0.18%) పెరిగి రూ.48004.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,021.00 వద్ద ప్రారంభమై, రూ.48,096.00 గరిష్టాన్ని, రూ.47,958.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71500 పైన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ రూ.71,500 పైనే ఉంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.151.00 (-0.21%) తగ్గి రూ.71530.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,650.00 వద్ద ప్రారంభమై, రూ.72,160.00 గరిష్టాన్ని, రూ.71,435.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.186.00 (-0.26%) తగ్గి రూ.72515.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,833.00 ప్రారంభమైన ధర, రూ.73,110.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,515.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1820 డాలర్లను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.15 (+0.28%) డాలర్లు పెరిగి 1,820.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,813.45 - 1,823.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. -0.064 (-0.23%) డాలర్లు పెరిగి 27.418 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.352 - 27.677 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications