బంగారం ధరలు నేడు (డిసెంబర్ 14 మంగళవారం) స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి రూ.48,300 క్రాస్ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు స్థిరంగా లేదా అతి స్వల్పంగా తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.7.00 (-0.01%) క్షీణించి రూ.48296.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,441 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను నేడు స్వల్పంగా క్షీణించింది. క్రితం సెషన్‌లో 1,788.30 డాలర్ల వద్ద ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ రోజు 2.35 (0.13%) క్షీణించి 1,785.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

యూఎస్ ఫెడ్ రిజర్వ్
కరోనా మహమ్మారి సమయంలో యూఎస్ ఫెడ్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని క్రమంగా రోల్-బ్యాక్ చేసే దిశగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ అడుగులు వేస్తుందనే అంచనాలు బంగారంపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. డాలర్ వ్యాల్యూ బలపడితే పసిడి ధరలు తగ్గుతాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంకు మంగళవారం తన రెండు రోజుల మానిటరీ పాలసీ సమావేశాన్ని ప్రారంభిస్తోంది. బాండ్ టాపరింగ్ పైన, వడ్డీ రేటు పెంపు పైన ఫెడ్ రిజర్వ్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వడ్డీ రేటు ప్రస్తుతం పెంచకపోయినప్పటికీ, త్వరలో పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం కూడా అంతంతే అని భావిస్తున్నారు. వివిధ అంశాల నేపథ్యంలో పసిడి ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఆచితూచి వ్యవహరిస్తున్న ఇన్వెస్టర్లు
ఫెడ్ నిర్ణయాలు వెల్లడయ్యే వరకు గోల్డ్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించవచ్చు. ఆర్థిక ప్యాకేజీని వెనక్కి తీసుకుంటే, వడ్డీ రేట్లు పెంచితే బాండ్ యీల్డ్స్ కూడా పెరుగుతాయి. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.48100-47880, నిరోధకస్థాయి రూ.48480-48650. వెండి మద్దతు ధర రూ.61220-60900. నిరోధకస్థాయి రూ.61900-62200.

వెండి ధరలు ఇలా
వెండి ధరలు నేడు అతి స్వల్పంగా క్షీణించాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.42 క్షీణించి రూ.61540.00 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.19.00 (-0.03%) తగ్గి రూ.62110.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.070 (-0.31%) డాలర్లు క్షీణించి 22.258 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏడాదిలో 3.76 శాతం క్షీణించగా, వెండి ధర ఏడాది కాలంలో 7 శాతం తగ్గింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications