For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, రూ.61,000 వద్ద వెండి

|

బంగారం ధరలు నేడు (శుక్రవారం, 10 జూన్) స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.51,000కు కాస్త అటు ఇటుగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు 1850 డాలర్ల దిగువకు రాగా, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.51,000కు సమీపంలోనే ఉన్నప్పటికీ, ఈ మార్కు దిగువన ట్రేడ్ అవుతున్నాయి. పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో చూస్తే రూ.5300 వరకు తక్కువగా ఉంది.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో రూ.125 తగ్గి రూ.50,880 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.171 తగ్గి రూ.51,076 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.224 తగ్గి రూ.61,187 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.202 క్షీణించి రూ.61,910 వద్ద ట్రేడ్ అయింది.

 Gold rate today: Yellow metal drops sharply, silver nears Rs 61,000

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్ (ఆగస్ట్ 22) నేటి సెషన్‌లో ఈ వార్త రాసే సమయానికి 7.65 డాలర్లు క్షీణించి 1845.15 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.279 డాలర్లు తగ్గి 21.538 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, రూ.61,000 వద్ద వెండి | Gold rate today: Yellow metal drops sharply, silver nears Rs 61,000

Gold prices were trading lower on Friday ahead of the much awaited US inflation numbers due later in the day, which could guide the future direction of Federal Reserve's monetary policy.
Story first published: Friday, June 10, 2022, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X