బంగారం, వెండి ధరలు నేడు (గురువారం, జూన్ 11) పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూన్ గోల్డ్ కాంట్రాక్ట్ ఉదయం గం.9.20 సమయానికి 10 గ్రాములకు 1.1 శాతం పెరిగి రూ.47,173 పలికింది. జూలై ఫ్యూచర్స్ సిల్వర్ 1.9 శాతం పెరిగి కిలో రూ.49,018 పలికింది. బంగారం రూ.47,000-రూ.47,200 మధ్య పలికితే ఆ తర్వాత రూ.47,500 నుండి రూ.48,000కు చేరుకునే అవకాశాలు తలుపులు తెరిచి ఉన్నట్లుగానే భావించాలని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం రూ.500, వెండి రూ.1000 పెరుగుదల
ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు ఏకంగా రూ.550 పెరిగి రూ.47,160కి అటు ఇటుగా ఉంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.950కి పైగా పెరిగి రూ.49,018 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్స్ 1,732.56 డాలర్లు పలికింది. అంతకుముందు జూన్ 2వ తేదీన రికార్డ్ ధర పలికింది. వెండి 1.7 శాతం తగ్గి 17.95 డాలర్లు పలికింది. ప్లాటినమ్ ధర మాత్రం 0.5 శాతం పెరిగి 836.38 డాలర్లు పలికింది.

బంగారం ధరలు తిరిగి ఎందుకు పెరుగుతున్నాయి
ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివిధ ఆర్థిక సంస్థలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండోసారి పుంజుకుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని చెబుతున్నాయి. కరోనా రెండోసారి విజృంభించకుంటే మాత్రం వచ్చే ఏడాదికి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటాయని వెల్లడించాయి. మరోవైపు కరోనా రెండోసారి పుంజుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి వరకు బంగారం ధరలు తగ్గి, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలపై ఆందోళన పరిస్థితులు కనిపించడంతో తిరిగి పెరుగుతున్నాయి.

ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్
2022 వరకు వడ్డీ రేటును సున్నాకు దగ్గరగానే ఉంచాలని ఫెడ్ రిజర్వ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోను పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు. కరోనా నుండి కోలుకొని లేబర్ మార్కెట్ పుంజుకునే వరకు ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపనలు కొనసాగుతాయని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. భారీ ఉద్దీపన చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు బంగారానికి డిమాండ్ పెంచుతాయి.

హైదరాబాదులో బంగారం ధరలు
హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఈ రోజు రూ.500 వరకు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.48,980కి ఎగబాకింది. 22 క్యారెట్ల బంగారం 44,940కి చేరుకుంది. ఢిల్లీలో రూ.500 పెరిగి రూ.46,910కి చేరుకున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications