దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.200 పెరిగి రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.210 పెరిగి రూ.46,040 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ.210 తగ్గి రూ.46,040 పలికింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఆల్ టైం గరిష్టంతో రూ.11,300 వరకు తక్కువగా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా
గోల్డ్ ఫ్యూచర్ ధరలు శుక్రవారం ప్రారంభ సెషన్లో స్వల్పంగా క్షీణించింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.54.00 (-0.12%) క్షీణించి రూ.44897.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,928.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,137.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,801.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,300 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.94.00 (-0.21%) తగ్గి రూ.45215.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,474.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,140.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.358 డౌన్
వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో కిలో రూ.341.00 (0.50%) తగ్గి రూ.67406.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,137.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,743.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,028.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.358.00 (0.52%) తగ్గి రూ.68385.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,256 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,681 వద్ద గరిష్టాన్ని, 68,173.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.70 (+0.16%) డాలర్లు పెరిగి 1,735.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,727.10 - 1,744.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైనే కదలాడుతోంది. ఔన్స్ ధర 0.118 (-0.45%) డాలర్లు క్షీణించి 26.233 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.933 - 26.398 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications