రూ.49,000 దిగువకు... భారీగా తగ్గిన బంగారం ధరలు, కారణమిదే
బంగారం ధరలు సోమవారం (డిసెంబర్ 14) భారీగా తగ్గాయి. గతవారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు రూ.49,300 వద్ద ముగిసింది. నేడు సాయంత్రం సెషన్‌కు రూ.500కు పైగా తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7,400 వరకు తక్కువగా ఉంది. రెండు వారాల క్రితం రూ.48,000 దిగువకు వచ్చిన పసిడి, గతవారం రూ.50,000 పైకి చేరుకుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రకటన నేపథ్యంలో మళ్లీ క్షీణించాయి.

రూ.500 తగ్గిన బంగారం
ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 504.00 (-1.02%) తగ్గి రూ.48820.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,101.00 వద్ద ప్రారంభమై, రూ.49,133.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.513.00 (-1.04%) తగ్గి రూ.48872.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,153.00 వద్ద ప్రారంభమై, రూ.49,153.00 వద్ద గరిష్టాన్ని, రూ,48,650.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ డౌన్
సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.359.00 (-0.56%) క్షీణించి రూ.63376.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,482.00 ప్రారంభమైన ధర రూ.64,093.00 గరిష్టాన్ని, రూ.62,720.00 కనిష్టాన్ని తాకింది. మే ఫ్యూచర్స్ సిల్వర్ రూ.345.00 (-0.53%) తగ్గి రూ.64195.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,991.00 వద్ద ప్రారంభమై, రూ.64,864.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,647.00 కనిష్టాన్ని తాకింది.

తగ్గిన పసిడి, వెండి
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 14.35 (-0.78%) డాలర్లు తగ్గి 1,829.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,822.10 - 1,845.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో బంగారం ధర 22.12 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.109 (-0.45%) డాలర్లు తగ్గి 23.983 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.770 - 24.358 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో వెండి 40 శాతానికి పైగా పెరిగింది.


Click it and Unblock the Notifications