ముంబై: బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ప్యాకేజీపై సంతకం చేసిన నేపథ్యంలో పసిడి ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. అయితే అది కేవలం ఒకటి, రెండు సెషన్లకే కనిపించింది. నిన్న కూడా ఉదయం భారీగా పెరిగినప్పటికీ, క్లోజింగ్ సమయానికి అతి స్వల్ప పెరుగుదలతో ముగించింది. నేడు మళ్ళీ బంగారం ధరలు తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.50,000 దిగువకు వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6,200కు పైన తక్కువగా ఉంది. వెండి ధరలు కూడా రూ.900 వరకు క్షీణించాయి.

బంగారం జంప్
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.74.00 (0.15%) క్షీణించి రూ.49939.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,051.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,141.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,908.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి 50వేల దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6200 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.101.00 (-0.20%) క్షీణించి రూ.50000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,152.00 వద్ద ప్రారంభమై, రూ.50,195.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల
నిన్న రూ.13000కు పైగా పెరిగిన వెండి ధరలు, నేడు తగ్గాయి. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 874.00 (-1.27%) తగ్గి రూ.67943.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,555.00 వద్ద ప్రారంభమై, రూ.68,770.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,805.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది. ఈ వారం రూ.69వేలు దాటి రూ.70వేల దిశగా కనిపించినా, ఆ తర్వాత పడిపోయింది.
మే ఫ్యూచర్స్ రూ.951.00 (-1.36%) పెరిగి రూ.68841.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,560.00 వద్ద ప్రారంభమై, రూ.69,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,793.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన, పసిడి నేడు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.65 (-0.19%) డాలర్లు పెరిగి 1,876.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,877.20 - 1,887.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.89 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. ఔన్స్ ధర 0.411 (1.55%) డాలర్లు తగ్గి 26.128 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.130 - 26.765
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.19% పెరిగింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications