నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు (బుధవారం (సెప్టెంబర్ 1) కూడా అదే ఒరవడిని కొనసాగించాయి. గత కొద్ది రోజులుగా బంగారం ఒత్తిడిలో ఉంది. ఈ ఏడాది చివరలో అమెరికా కేంద్ర బ్యాంకు తన అసెట్ పర్చేజ్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ సంకేతాలు ఇచ్చారు. ఈ ఏడాదిలోనే నెలవారీ బాండ్స్ కొనుగోలులో కోతలను ప్రారంభించవచ్చునని సంకేతాలిచ్చినప్పటికీ, సరైన గడువు తేదీ ప్రకటించకపోవడంతో సెప్టెంబర్ నెలలో జరిగే పరపతి విధాన సమావేశంలో స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తుండవచ్చు.
ఈ ప్రభావం పసిడి ధరల పైన కనిపిస్తోంది. దీంతో వరుసగా ధరలు పడిపోతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో నేడు 0.10 శాతం వరకు తగ్గగా, వెండి నిన్న భారీగా తగ్గి, నేడు 0.10 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు నాలుగు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు 1820 డాలర్లకు చేరుకుంది.
అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (బుధవారం) ప్రారంభ సెషన్‌లో రూ.31.00 (-0.07%) తగ్గి రూ.47089.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.42.00 (-0.09%) తగ్గి రూ.47225.00 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో బంగారం ధరలు రూ.9,000 వరకు తక్కువగా ఉన్నాయి.
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.83.00 (0.13%) పెరిగి రూ.62999.00 వద్ద పెరగగా, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.276.00 (-0.44%) తగ్గి రూ.63090.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం తగ్గింది. ఇటీవల 1820 డాలర్ల పైకి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఆ మార్కు దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1.60 (0.09%) డాలర్లు తగ్గి 1,816.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల 1800 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం ఈ మార్కును దాటింది.సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్లకు దిగువకు వచ్చింది. నేడు 0.163 (-0.68%) డాలర్లు తగ్గి 23.843 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
ప్రస్తుతం బంగారం ధరలు కాస్త క్షీణించాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇన్వెస్ట్ చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000 వరకు తక్కువగా ఉంది. అయితే మున్ముందు పసిడి మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications