Gold prices: నిన్న భారీగా తగ్గి, నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు

నిన్న (మంగళవారం) భారీగా తగ్గిన బంగారం ధరలు బుధవారం (సెప్టెంబర్ 8) మళ్లీ పెరిగాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.141.00 (0.30%) లాభపడి రూ.47080.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 80.00 (0.17%) పెరిగి రూ.47200.00 వద్ద ట్రేడ్ అయింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఊగిసలాటలో ఉన్నాయి. రూ.47,000 నుండి రూ.45,7000 మధ్య కదలాడుతున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.65,000 దిశగా సాగుతోంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.153.00 (0.24%) పెరిగి రూ.64774.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.91.00 (0.14%) పెరిగి రూ.65519.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువనే ఉంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.25 (+0.07%) డాలర్లు పెరిగి 1,799.75 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.029 (+0.12%) డాలర్లు పెరిగి 24.402 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రూ.47,000 నుండి రూ.48,000 మధ్య కదలాడుతున్నాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నిన్న రూ.495.00 (-1.04%) తగ్గి రూ.46930.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.405.00 (-0.85%) క్షీణించి రూ.47163.00 వద్ద ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న రూ.646.00 (-0.99%) తగ్గి రూ.64646.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.566.00 (-0.86%) పడిపోయి రూ.65437.00 వద్ద ముగిసింది.

Gold prices up to Rs 47,080 on weak global cues, firm dollar

అమెరికా జాబ్ రిపోర్ట్ అనంతరం బంగారం ధరలు గత శుక్రవారం రెండున్నర నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అయితే పేరోల్ క్షీణత తాత్కాలికమేనని అర్థమైన నేపథ్యంలో ఈ వారం ప్రారంభం నుండి బంగారం ధరలు క్షీణిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ 1800.00 డాలర్ల స్థాయిలో ఉంది. షార్ట్ టర్మ్ రేంజ్ 1922.00 నుండి 1677.90 డాలర్లుగా అంచనా వేస్తున్నారు. లాంగ్ టర్మ్ రీట్రేస్‌మెంట్ జోన్ మద్దతు ధర 1795.00 డాలర్ల నుండి 1716 డాలర్లు. 1800 డాలర్ల వద్ద టెక్నికల్‌గా బౌన్స్ కనిపిస్తోందని, 1795 డాలర్ల వద్ద విఫలమైతే 1781 డాలర్ల దిశగా, ఆ తర్వాత 1774 డాలర్లకు పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. పసిడి 1828 డాలర్ల స్థాయికి చేరుకుంటే, ఆ తర్వాత గత శుక్రవారం గరిష్టస్థాయి 1836.90 డాలర్లను తాకవచ్చునని, మరింత బలపడి 1837.50 డాలర్లు, 1839.00 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు. తదుపరి మేజర్ టార్గెట్ జూన్ 8 నాటి గరిష్టం 1910 డాలర్లు.

22 క్యారెట్ల బంగారం ధరలు ముంబైలో రూ.46,410.

22 క్యారెట్ల బంగారం ధరలు ఢిల్లీలో రూ.46,550.

22 క్యారెట్ల బంగారం ధరలు చెన్నైలో రూ.44,740

22 క్యారెట్ల బంగారం ధరలు కోల్‌కతాలో రూ.46,850.

22 క్యారెట్ల బంగారం ధరలు బెంగళూరులో రూ.44,400.

22 క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్‌లో రూ.44,400.

22 క్యారెట్ల బంగారం ధరలు కేరళలో రూ.44,400.

22 క్యారెట్ల బంగారం ధరలు పుణేలో రూ.45,680.

22 క్యారెట్ల బంగారం ధరలు అహ్మదాబాద్‌లో రూ.45,850.

22 క్యారెట్ల బంగారం ధరలు పాట్నాలో రూ.45,680.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+