బంగారం ధరలు గతవారం ఎంత పెరిగాయంటే? నిరోధకస్థాయి, మద్దతు ధర ..
బంగారం ధరలు గతవారం (ఆదివారం నుండి శనివారం వరకు) 0.35 శాతం మేర పెరిగింది. మొత్తంగా రూ.170కి పైగా పెరిగింది. చివరి సెషన్ జనవరి 1న గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి రూ.84 పెరిగి రూ.50,235 వద్ద క్లోజ్ అయింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.136 ఎగిసి రూ.50,319 వద్ద ముగిసింది. గతవారం పసిడి ఎక్కువగా రూ.50,000కు పైనే కదలాడింది. చివరకు రూ.50,200కు పైన క్లోజ్ అయింది. భారీగా పెరుగుదల లేదా భారీగా తగ్గుదల లేక దాదాపు స్థిరంగా ఉందని చెప్పవచ్చు. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.6000 తక్కువగా ఉంది.

బంగారం ధరలు
ముంబై బులియన్ రిటైల్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి రూ.46,073 (3 శాతం జీఎస్టీ అదనం), 24 క్యారెట్ల పసిడి రూ.50,298 (3 శాతం జీఎస్టీ అదనం) వద్ద క్లోజ్ అయింది. సీఎఫ్టీసీ డేటా ప్రకారం నికర లాంగ్ పొజిషన్లు 14 వారాల గరిష్టానికి 9,369 లాట్లు పెంచారు. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ హోల్డింగ్స్ సంస్థ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.9 శాతం టన్నులు పెరిగి 1,170.73 టన్నులుగా నమోదయింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ గురువారం 89.89 వద్ద ముగిసింది. 0.28 శాతం లాభపడింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగిందంటే
ఎంసీఎక్స్ బుల్ డెస్క్ 22 పాయింట్లు లేదా 0.14 శాతం పెరిగి 15,690గా ఉంది. బంగారం ధరలు ఐదవ వారంలో లాభాల్లో ముగిశాయని, కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.79 శాతం లాభపడి ఔన్స్ 1898 డాలర్లకు చేరుకుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ (కమోడిటీస్) సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అన్నారు. గత ఏడాది బంగారం ధరలు ఎప్పుడు లేని విధంగా 25 శాతం లాభాలతో ముగిశాయి.

నిరోధకస్థాయి.. మద్దతు ధర
బంగారం ధరలు ప్రస్తుతం స్థాయిలోనే బుల్లిష్‌గా ఉంటే కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ నిరోధకస్థాయి ఔన్స్ 1920గా అంచనా భావిస్తున్నారు. మద్దతు ధర 1860 డాలర్లు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.51,200 నిరోధకస్థాయి, మద్దతు ధర రూ.49,700


Click it and Unblock the Notifications