భారీగా తగ్గి, అంతేస్థాయిలో పెరిగిన బంగారం, వెండిదీ అదే దారి
నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. క్రితం సెషన్‌లో రూ.49,000 దిగువకు చేరుకోగా, నేడు మళ్లీ ఆ మార్కును దాటాయి. వెండి ఫ్యూచర్స్ కూడా దాదాపు రూ.వెయ్యి పెరిగి రూ.71,500 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగినప్పటికీ, 1900 డాలర్ల దిగువకు వచ్చాయి. వెండి పెరిగింది. కానీ 28 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7100 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టంతో 180 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

భారీగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.413.00 (0.85%) పెరిగి రూ.49090.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,631.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,176.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,554.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.413.00 (0.84%) పెరిగి రూ.49400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,990.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,538.00 గరిష్టాన్ని, రూ.48,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.845 పెరిగిన వెండి
నిన్న రూ.2వేలకు పైగా సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గిన జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు పెరిగింది. సాయంత్రం సెషన్లో రూ.844.00 (1.19%) పెరిగి రూ.71654.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,710.00 వద్ద ప్రారంభమై, రూ.71,766.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,329.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.772.00 (1.07%) పెరిగి రూ.72759.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,868.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,887.00 గరిష్టాన్ని, రూ.71,580.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1895 డాలర్ల దిగువన ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు +19.55 (1.04%) డాలర్లు తగ్గి 1,892.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,858.15 - 1,898.90 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.386 (1.40%) డాలర్లు పెరిగి 27.867 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.320 - 27.973 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications