ముంబై: బంగారం ధరలు నేడు(జనవరి 29, శుక్రవారం) భారీగా పెరిగాయి. కొద్దిరోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు నిన్న ప్రారంభ సెషన్లోను పెరిగినప్పటికీ, చివరకు తగ్గాయి. నేడు కూడా ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగి.. ఆ తర్వాత అంతకంతకూ ఎగిశాయి. సాయంత్రం సెషన్‌కు రూ.500కు పైగా పెరిగి, రూ.49,000ను క్రాస్ చేసింది. కొద్ది రోజులుగా పసిడి ధరలు యాభై వేల రూపాయల వద్దే కదలాడుతోంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7000కు పైగా తక్కువగా ఉంది.

49,000కు పైకి పసిడి
నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 454.00 (0.93%) పెరిగి రూ.49,078.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,624.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,485.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,624.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000కు పైగా తక్కువ ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 448.00 (0.92%) పెరిగి రూ.49,384.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,050.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,831.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,992.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

భారీగా షాకిచ్చిన వెండి
వెండి భారీగా షాకిచ్చింది. ఏకంగా రూ.2500 నుండి రూ.3000 మధ్య పెరిగి రూ.70,000 దాటింది. సాయంత్రం సెషన్లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలో 2,505.00 (3.71%) పెరిగి రూ.70100.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,641.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,290.00 వద్దనే గరిష్టాన్ని, రూ.68,353.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి మూడు రోజుల్లో రూ.4వేలకు పైగా పెరిగింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.2,438.00 (3.56%) పెరిగి రూ.71000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,628.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,234.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,332.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1860 డాలర్ల పైకి పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1860 డాలర్ల పైకి చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +19.00 (+1.03%) డాలర్లు పెరిగి 1,860.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,841.15 - 1,878.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.51% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +1.283 (+4.95%) డాలర్లు తగ్గి 27.205 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.152 - 27.765 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.55శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications