నేడు పెరిగిన బంగారం ధరలు, కారణాలు ఇవే...
బంగారం, వెండి ధరలు సోమవారం (సెప్టెంబర్ 14) పెరిగాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ, డాలర్ వ్యాల్యూ, కరోనా మహమ్మారి కేసులు పెరగడం వంటి వివిధ కారణాలు పసిడిపై ప్రభావం చూపాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రం సమయానికి పసిడి ధరలు 10 గ్రాములు 0.35 శాతం లేదా రూ.179 పెరిగి రూ.51,498 పలికాయి. వెండి కిలో ఫ్యూచర్స్ 0.37 శాతం లేదా రూ.252 ఎగిసి రూ.68,180 పలికింది. శుక్రవారం బంగారం ధరలు తగ్గిన విషయం తెలిసిందే. వెండి ధరలు కూడా వెయ్యి రూపాయల వరకు తగ్గింది. కానీ ఈ రోజు తిరిగి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి.
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర అతి దాదాపు ఫ్లాట్‌గా ఉండి 1,941.11 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1948.30 డాలర్లకు చేరుకుంది. సిల్వర్ ఔన్స్ ధర 26.68 డాలర్లు, ప్లాటినమ్ 0.4 శాతం పెరిగి 928.61 డాలర్లు పలికింది. ప్రధానంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో బంగారం ధరలు... ఉదయం 22 క్యారెట్ల పసిడి రూ.48,900, 24 క్యారెట్ల పసిడి రూ.53,400 దిగువన ఉంది. వెండి ధరలు కిలో రూ.68,000కు చేరువయ్యాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.48,900, 24 క్యారెట్ల పసిడి రూ.54,400గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications