ముంబై: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. గత వారం రోజులుగా ఫ్యూచర్ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 8) పసిడి ధరలు దేశ రాజధాని ఢిల్లీలో రూ.800కు పైగా పెరిగి రూ.49,430 పలికింది. వెండి ధరలు కూడా ఎగిశాయి. కొనుగోళ్ల నేపథ్యంలో రూ.3,000కు పైగా పెరిగి కిలో వెండి రూ.64,300 పైకి చేరుకుంది. కరోనా కారణంగా వివిధ దేశాల్లో కేసులు పెరగడం, ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం గురించి యూఎస్ ఫెడ్ రిజర్వ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పసిడిలో పెట్టుబడులు పెరిగాయి. అసలు గత ఐదారు సెషన్లుగా పసిడి, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే, నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్ పెరగడం వల్ల కూడా మన వద్ద పెరిగాయని అంటున్నారు.

ఆ ధరతో రూ.6,000 డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.219.00 (0.44%) పెరిగి రూ.50165.00 వద్ద ఉంది. రూ.50,065.00 ప్రారంభమైన ధర, రూ.50,175.00 గరిష్టాన్ని, రూ.49,711.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.111.00 (0.22%) ఎగిసి రూ.50125.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,120.00 వద్ద ప్రారంభమై, రూ.50,264.00 గరిష్టాన్ని, రూ.49,799.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.6000 తక్కువగా ఉంది. పది సెషన్ల క్రితం రూ.48వేల దిగువకు వచ్చిన పసిడి అఫ్పటి నుండి రూ.2,000కు పైగా పెరిగింది.

రూ.65,500 దాటిన వెండి
సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.65,500ను క్రాస్ చేసింది. మార్చి ఫ్యూచర్స్ రూ.248.00 (0.38%) పెరిగి రూ.65747.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,388.00 వద్ద ప్రారంభమై, రూ.65,817.00 గరిష్టాన్ని, రూ.64,576.00 కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.326.00 (0.49%) పెరిగి రూ.66662.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,227.00 వద్ద ప్రారంభమై, రూ.66,662.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,450.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ మళ్లీ 1900 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. నేడు ఔన్స్ 4.55 (+0.24%) డాలర్లు పెరిగి 1,870.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,863.95 - 1,879.75 డాలర్ల మధ్య కదలాడింది. క్రితం సెషన్లో 1,866.00 వద్ద ముగిసింది. ఏడాదిలో 25.36% పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్వల్పంగా తగ్గింది. ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.111 (-0.45%) డాలర్లు తగ్గి 24.683 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.552 - 25.015 డాలర్ల మధ్య కదలాడింది. క్రితం సెషన్లో 24.794 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 48.82% పెరిగింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications