బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 10, గురువారం) స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్లో ధరలు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రానికి 10 గ్రాముల అక్టోబర్ డెలివరీ రూ.63 (0.12 శాతం) పెరిగి రూ.51,465 పలికింది. బిజినెస్ టర్నోవర్ 12,523 లాట్లుగా ఉంది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.54 ఎగిసి (0.10 శాతం) రూ.51,667 పలికింది. బిజినెస్ టర్నోవర్ 6,181 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ వరుసగా రూ.2,365.55 కోట్లు, రూ.233.26 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ అక్టోబర్ రూ.14 పెరిగి రూ.51,500 పలికింది. బిజినెస్ టర్నోవర్ రూ.16,262 లాట్లుగా ఉంది.
గత నెల 7వ తేదీన బంగారం 10 గ్రాములు రూ.56,200 గరిష్టానికి, వెండి కిలో రూ.78వేల సమీపానికి చేరుకుంది. ఈ గరిష్ట ధరలతో బంగారం ఇప్పటికీ రూ.5000 వరకు తక్కువగా, వెండి రూ.10000 తక్కువగా పలుకుతోంది. రష్యా వ్యాక్సీన్ వచ్చిన అనంతరం బంగారం అమాంతం పడిపోయింది. అయితే ఆ తర్వాత రూ.50 వేల పై నుండి రూ.52వేల మధ్య తచ్చాడుతోంది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.425 పెరిగి రూ.51,476 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1.51 డాలర్లు ఎగిసి ఔన్స్ ధర 1,948.13 పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 1.8 శాతం ఎగిసి 917.31 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ప్లాటినమ్ సరఫరా బాగానే ఉంది. ఈ ఏడాది మాత్రం తగ్గుదల నమోదు చేస్తుందని వరల్డ్ ప్లాటినమ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ఇక, వెండి 0.7 శాతం ఎగిసి ఔన్స్ 26.88 డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications