బంగారం ధరలు పెరిగాయ్ కానీ...: వివిధ నగరాల్లో ధరలు
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దాదాపుగా స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగానే పెరుగుతున్నప్పటికీ, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ కాస్త బలపడటంతో మన వద్ద స్వల్ప పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. గతవారం 76 వరకు ఉన్న రూపాయి ఇప్పుడు 75 పైసలకు వచ్చింది. నిన్న 3 పైసలు లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ 1810 డాలర్లకు పైన, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.48,000కు పైన ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్లను క్రాస్ చేశాయి. మన వద్ద రూ.62వేలు దాటింది.

రూ.48,000కు పైనే బంగారం ధర
గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నేడు(సోమవారం, 28 డిసెంబర్) సెషన్‌లో స్వల్పంగా రూ.97 పెరిగి రూ.48,163 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.98 ఎగిసి రూ.48,229 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.11 శాతం లాభపడి 1810 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1808 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 4.7 శాతం ఎగిసింది. నేటి సెషన్లో 1809 డాలర్ల నుండి 1813 డాలర్ల స్థాయిలో కదలాడింది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే అది స్వల్పంగానే నమోదవుతోంది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.27 శాతం లాభపడి 23.052 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 22.989 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 23 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. ఏడాదిలో 12.33 శాతం పెరిగింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ.94 పెరిగి రూ.62,395 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62 పెరిగి రూ.63,054కు చేరుకుంది.

వివిధ నగరాల్లో ధరలు
వివిధ నగరాల్లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి...
ముంబై 22 క్యారెట్ల పసిడి 47,240/-, 24 క్యారెట్ల పసిడి 48,240/-
ఢిల్లీ 22 క్యారెట్ల పసిడి 47,600/-, 24 క్యారెట్ల పసిడి 51,900/-
బెంగళూరు 22 క్యారెట్ల పసిడి 45,450/-, 24 క్యారెట్ల పసిడి 49,590/-
హైదరాబాద్ 22 క్యారెట్ల పసిడి 45,450/-, 24 క్యారెట్ల పసిడి 49,590/-
చెన్నై 22 క్యారెట్ల పసిడి 45,550/-, 24 క్యారెట్ల పసిడి 49,690/-
కేరళ 22 క్యారెట్ల పసిడి 45,450/-, 24 క్యారెట్ల పసిడి 49,590/-
కోల్‌కతా 22 క్యారెట్ల పసిడి 47,400/-, 24 క్యారెట్ల పసిడి 50,100/-


Click it and Unblock the Notifications