బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ పసిడి రూ.48,000కు పైనే ఉంది. రూ.73వేలను క్రాస్ చేసి బంగారం కంటే వేగంగా దూసుకెళ్లిన వెండి మాత్రం నేడు స్వల్పంగా తగ్గి ఈ మార్కు దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరగగా, వెండి తగ్గింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1875 డాలర్ల దిశగా పరుగెడుతోంది. వెండి 28 డాలర్ల పైనే ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. దీంతో దాదాపు స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధరల్లో పెరుగుదల
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.73.00 (0.15%) పెరిగి రూ.48380.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,261.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,400.00 గరిష్టాన్ని, రూ.48,219.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.66.00 (0.14%) పెరిగి రూ.48889.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,792.00 వద్ద ప్రారంభమై, రూ.49,919.00 గరిష్టాన్ని, రూ.48,704.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి తగ్గుదల
వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.374.00 (0.51%) పెరిగి రూ.72822.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,630.00 వద్ద ప్రారంభమై, రూ.73,020.00 గరిష్టాన్ని, రూ.72,340.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.247.00 (-0.33%) తగ్గి రూ.73976.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,830.00 ప్రారంభమైన ధర, రూ.74,075.00 వద్ద గరిష్టాన్ని, రూ.73,500.00 కనిష్టాన్ని తాకింది.

అక్కడా జంప్
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.50 (0.19%) డాలర్లు పెరిగి 1,871.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,864.80 - 1,874.40 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.188 (0.66%) డాలర్లు తగ్గి 28.145 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.003 - 28.340 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications