బంగారం ధరల క్షీణత కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆందోళనలు తగ్గడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి నుండి ఇన్వెస్టర్లు డబ్బును వెనక్కి తీసుకుంటూ, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పసిడి ధరలు భారీగానే తగ్గుతున్నాయి. ఇటీవల ఏడాదిన్నర గరిష్టానికి లేదా ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 సమీపానికి వెళ్లి మళ్లీ క్షీణిస్తున్నాయి. వెండి ధరలు రూ.70,000 క్రాస్ చేసినప్పటికీ, ఇప్పుడు రూ.68,000 స్థాయికి దిగి వచ్చాయి.

నిన్న ముగింపు
బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.54 క్షీణించి రూ.51,510 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.43 తగ్గి రూ.51,981 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్ప పెరుగుదల లేదా దాదాపు స్థిరంగా ఉంది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.27 పెరిగి రూ.68,352 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1929 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 25.158 డాలర్ల వద్ద ముగిసింది.

నేడు పసిడి ధరలు
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.243 తగ్గి రూ.51,321 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.199 క్షీణించి రూ.51,825 వద్ద ట్రేడ్ అయింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో రూ.452 తగ్గి రూ.67,873 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.378 తగ్గి రూ.68,700 వద్ద ట్రేడ్ అయింది. నేడు కనీసం రూ.69,000 మార్కును కూడా తాకలేదు.
పసిడి ధరలు కేవలం వారం రోజుల్లోనే రూ.2500 నుండి 3000 వరకు తగ్గింది. ఈ నెల రూ.55,000కు పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.51,500 దిగువకు వచ్చింది. అలాగే వెండి కిలో రూ.3000కు పైగా తగ్గింది.

150 డాలర్లు తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్
అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నెల 8వ తేదీన 2069 డాలర్లకు చేరిన ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి సెషన్‌లో 1915 డాలర్లకు కూడా పడిపోయింది. అంటే ఈ వారం రోజుల్లోనే 150 డాలర్లకు పైగా తగ్గింది. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 12 డాలర్లు క్షీణించి 1917 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల దిగువకు వచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications