బంగారం ధరలు శుక్రవారం (సెప్టెంబర్ 3) స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.73.00 (0.15%) తగ్గి రూ.47047.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.17.00 (0.04%) తగ్గి రూ.47250.00 (0.15%) వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.50.00 (0.08%) పెరిగి రూ.63335.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.13.00 (0.02%) పెరిగి రూ.64160.00 ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.47,500 వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఈ ఐదు సెషన్‌లలో దాదాపు రూ.500 వరకు తగ్గింది.
వరుస సెషన్‌లలో బంగారం క్షీణిస్తోంది. ఈ వారం ప్రారంభంలో రూ.63,000 దిగువన ట్రేడ్ అయిన పసిడి ఇటీవల పెరుగుతోంది. నేడు డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.50 పెరిగి రూ.63,335 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.13 పెరిగి రూ.64,160 వద్ద ట్రేడ్ అయింది. నిన్న సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లకు పైనే ఉంది. నేటి ప్రారంభ సెషన్‌లో 1.25 (+0.07%) డాలర్లు పెరిగి 1,812.85 డాలర్ల వద్ద, 0.039 (+0.16%) డాలర్లు పెరిగి 23.957 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత కొద్ది రోజులుగా బంగారం ఒత్తిడిలో ఉంది. ఈ ఏడేదా చివరలో అమెరికా కేంద్ర బ్యాంకు తన అసెట్ పర్చేజ్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ సంకేతాలిచ్చారు. ఈ ఏడాదిలో నెలవారీ బాండ్స్ కొనుగోలులో కోతలను ప్రారంభించవచ్చునని సంకేతాలిచ్చినప్పటికీ, సరైన గడువు తేదీ ప్రకటించకపోవడంతో సెప్టెంబర్ నెలలో జరిగే పరపతి విధాన సమావేశంలో స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తుండవచ్చు. ఈ ప్రభావం పసిడి ధరల పైన కనిపిస్తోంది.
ప్రస్తుతం పండుగ సీజన్‌లో బంగారం డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధరలు ఈ వారం రూ.1000 వరకు తగ్గాయి. డాలర్ మారకంతో రూపాయి 73.06వద్ద నిలిచింది. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి... ముంబైలో పది గ్రాముల 22 గ్రాముల బంగారం ధర రూ.46,280, ఢిల్లీలో పది గ్రాముల 22 గ్రాముల బంగారం ధర రూ.46,350, చెన్నైలో పది గ్రాముల 22 గ్రాముల బంగారం ధర రూ.44,510, కోల్‌కతాలో రూ.46,700, బెంగళూరులో 22 గ్రాముల బంగారం ధరలూ రూ.44,200, హైదరాబాద్‌లో 22 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉంది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications