ఉదయం తగ్గి, సాయంత్రానికి పెరిగిన బంగారం ధరలు: మళ్లీ రూ.49,000 క్రాస్

బంగారం ధరలు నేడు (గురువారం, 10 జూన్) తగ్గినప్పటికీ సాయంత్రానికి కాస్త పెరిగాయి. ఉదయం రూ.250 వరకు తగ్గిన పసిడి ఫ్యూచర్ రూ.49,000 దిగువకు పడిపోయింది. అయితే సాయంత్రం సెషన్‌కు రూ.49,000 క్రాస్ చేసింది. ఓ సమయంలో రూ.49,200 సమీపానికి చేరుకుంది. వెండి ధరలు కూడా పెరిగి రూ.72,000 దాటాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్ ఒక డాలర్ వరకు క్షీణించగా, సిల్వర్ ఫ్యూచర్ స్వల్పంగా పెరిగి 28 డాలర్లు దాటింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.7000 తక్కువగా ఉంది.

తగ్గి, పెరిగిన బంగారం ధర

తగ్గి, పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.240.00 తగ్గి రూ.48884.00 వద్ద ట్రేడ్ అయింది. అయితే సాయంత్రానికి రూ.51.00 (0.10%) పెరిగి రూ.49175.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,018.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,195.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,675.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.29.00 (0.06%) పెరిగి రూ.49440.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,325.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,474.00 గరిష్టాన్ని, రూ.49,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిదీ అదే దారి

వెండిదీ అదే దారి

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.189.00 (0.26%) పెరిగి రూ.72073.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 వద్ద ప్రారంభమై, రూ.72,075.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.163.00 (0.22%) తగ్గి రూ.73185.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,645.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,185.00 గరిష్టాన్ని, రూ.72,210.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.05 (0.00%) డాలర్లు తగ్గి 1,895.00 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,871.95 - 1,896.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.030

(0.11%) డాలర్లు తగ్గి 28.032 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.525 - 28.093 డాలర్ల మధ్య కదలాడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+