భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: 10 గ్రాముల పసిడి రూ.500 జంప్
గత రెండు రోజులుగా రూ.550కి పైగా తగ్గిన పసిడి ధరలు శుక్రవారం(అక్టోబర్ 31) అదేస్థాయిలో పెరిగాయి. మొన్న ఒక్కరోజే డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.450 వరకు తగ్గింది. ఈ రోజు రూ.450కి పైగా పెరిగింది. సాయంత్రం గం.9.30 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.459 (0.91 శాతం) పెరిగి రూ.50,741 పలికింది. రూ.50,465.00 ప్రారంభమై, రూ.50,870.00 గరిష్టాన్ని, రూ.50,353.00 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో ఆగస్ట్ 7 ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5,500 తక్కువ పలికింది.

రూ.450కి పైగా పెరుగుదల.. సేల్స్ పెరిగే ఛాన్స్
మార్చి గోల్డ్ ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దారిలోనే నడిచింది. ఇది రూ.469 (0.93 శాతం) పెరిగి రూ.50,833 పలికింది. రూ.50,510 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,968 వద్ద గరిష్టాన్ని, రూ.50,450 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ మాసం నుండి పసిడి ధరలు రూ.49వేల నుండి రూ.51వేల మధ్య ఉన్నాయి. కాస్త స్థిరంగా ఉండటంతో పాటు ఈ ధరలకు వినియోగదారులు అలవాటు పడుతున్నారని, కాబట్టి దీపావళి నాటికి రిటైల్ సేల్స్ మరింత పుంజుకోనున్నాయని అంచనా వేస్తున్నారు.

వెండి రూ.550 జంప్
బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.578 (0.96 శాతం) పెరిగి రూ.60,750 పలికింది. రూ.60,557 వద్ద ప్రారంభం కాగా, రూ.61,326 వద్ద గరిష్టాన్ని, రూ.59,918 వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు రూ.1400కు పైగా హెచ్చుతగ్గులు చూసింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.546 (0.88 శాతం) పెరిగి రూ.62,280 పలికింది. రూ.62,150 వద్ద ప్రారంభం కాగా, రూ.62,882 వద్ద గరిష్టాన్ని, రూ.61,518 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను పెరిగిన ధరలు...
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.73 శాతం (14 డాలర్లు) పెరిగి 1,881.85 డాలర్లుగా పలికింది. 1,864.20 - 1,890.70 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,868.00 డాలర్లు పలికింది. ఈ ఏడాది పసిడి ధరలు 22.4 శాతం పెరిగింది.
ఇక వెండి 1.36 శాతం (0.317 డాలర్లు) పెరిగి 23.677 డాలర్లు పలికింది. 23.230 - 23.907 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.360 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 28.89 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications