Gold prices today: బంగారం ధరలు పెరిగాయి, కానీ రూ.51,000 దిగువనే
బంగారం ధరలు నేడు(మే 2, గురువారం) పెరిగాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.51,000 దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. పసిడి ధరలు రెండువారాల కనిష్టం వద్ద ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5400 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను గోల్డ్ ఫ్యూచర్ 1850 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 225 డాలర్లు తక్కువగా ఉంది.
ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.104 పెరిగి 50,892 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,806 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.163 తగ్గి రూ.61,417 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.103 తగ్గి రూ.62,164 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ కొద్ది రోజుల క్రితం రూ.50,000 దిగువకు వచ్చినప్పటికీ, ఆ తర్వాత పెరిగాయి. దీంతో ప్రస్తుతం రూ.51,000 స్థాయిలో ఉంది.

ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 0.70 డాలర్లు పెరిగి 1849 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.075 డాలర్లు ఎగిసి 21.845 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అమెరికా డాలర్ పడిపోవడం, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ మళ్లీ తగ్గడం పసిడి పైన ప్రభావం చూపింది.


Click it and Unblock the Notifications