Gold Prices Today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఐతే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు 1820 డాలర్లకు చేరువైంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో (శుక్రవారం 31 డిసెంబర్) రూ.11.00 (0.02%) పెరిగి రూ.47896.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47972.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 5.30 డాలర్లు ఎగిసి 1819.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 5 శాతం మేర క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి నేటి ప్రారంభ సెషన్‌లో రూ.119 పెరిగి రూ.62,279 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,788 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్లకు పైనే ఉంది. నేటి సెషన్‌లో 0.122 డాలర్లు పెరిగి 23.172 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ధరలు 14 శాతం మేర క్షీణించాయి. పసిడి ధరలు ఇటీవల అతి స్వల్పంగా మాత్రమే పైకి, కిందకు కదులుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1800 డాలర్ల నుండి 1788 డాలర్లు. నిరోధకస్థాయి 1828 డాలర్ల నుండి 1840 డాలర్లు. వెండి మద్దతు ధర 22.88 డాలర్ల నుండి 22.55 డాలర్లు. నిరోధకస్థాయి 23.34 డాలర్ల నుండి 23.58 డాలర్లు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం మద్దతు ధర రూ.47,700 నుండి రూ.47,550. నిరోధకస్థాయి రూ.48,050 నుండి రూ.48,220. మద్దతు ధర రూ.61,700 నుండి రూ.61,400. నిరోధకస్థాయి రూ.62,660 నుండి రూ.63,100.


Click it and Unblock the Notifications