వరుస సెషన్‌లలో భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు (బుధవారం, ఆగస్ట్ 11) దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.11.00 (0.02%) పెరిగి రూ.45973.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,011.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,051.00 గరిష్టాన్ని, రూ.45,973.00 కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.82.00 (0.18%) పెరిగి రూ.46200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,260.00 ప్రారంభమైన ధర, రూ.46,260.00 గరిష్టాన్ని, రూ.46,260.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.57.00 (-0.09%) క్షీణించి రూ.62579.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.80.00 (-0.13%) నష్టపోయి రూ.63358.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.50 డాలర్లు లాభపడి 1,733.15 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.034 డాలర్లు క్షీణించి 23.358 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,000 దిగువనే ఉన్నాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టామ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఇప్పుడు రూ.10,200 తక్కువగా ఉన్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఓ సమయంలో రూ.50,000కు చేరుకున్నప్పటికీ మళ్లీ పతనమయ్యాయి. ఈ కొద్ది నెలల్లోనే రూ.4000 వరకు క్షీణించింది. వెండి ధరలు గత పది సెషన్లలోనే రూ.6,000కు పైగా క్షీణించింది. వరుస రెండు సెషన్‌లలో రూ.4000కు పైగా తగ్గింది.

డాలర్ ఇండెక్స్ 93 మార్క్ దాటి నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం నాడు యూఎస్ సెనేట్ 1 ట్రిలియన్ డాలర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లును పాస్ చేసింది. దీంతో డాలర్ పైపైకి ఎగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్‌కు 1700 డాలర్ల వద్ద కొనసాగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ మద్దతు ధర రూ.45800-45550, నిరోధకస్థాయి రూ.46100-46330, వెండి మద్దతు ధర రూ.62200-61700, నిరోధకస్థాయి రూ.63100-63600గా ఉండవచ్చు. రూ.45,550 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.46,100 టార్గెట్ ధరతో రూ.45,750 వద్ద బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications