బంగారం ధరలు క్రితం సెషన్‌లో రూ.46,000 దిగువకు పతనమయ్యాయి. కొద్దిరోజుల క్రితం కరోనా సెకండ్ వేవ్, కరోనా థర్డ్ వేవ్ ఆందోళన, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పసిడి ధరలు రూ.50,000ను తాకాయి. అంతకుముందు రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్, తిరిగి రూ.6,000 వరకు పెరిగింది. అయితే ఆందోళనలు తగ్గడంతో ధరలు మళ్లీ క్షీణిస్తున్నాయి. నిన్నటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.700 వరకు తగ్గింది. రెండు సెషన్‌లలో రూ.1800 వరకు తగ్గింది.
నిన్న రూ.46,311.00 వద్ద ప్రారంభమైన అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్, రూ.46,386.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,815.00 కనిష్టాన్ని తాకింది. చివరకు రూ.692.00 (-1.48%) క్షీణించి రూ.45948.00 వద్ద ముగిసింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,556.00 వద్ద ప్రారంభమై, రూ.46,556.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,007.00 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు రూ.633.00 (-1.35%) క్షీణించి రూ.46143.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ అయితే ఏకంగా రూ.63,000 దిగువకు పతనమైంది. నిన్న ఒక్కరోజే రూ.2,2000 తగ్గింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64,710.00 వద్ద ప్రారంభమై, రూ.64,710.00 గరిష్టాన్ని, రూ.62,318.00 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు రూ.2,228.00 (-3.43%) తగ్గి రూ.62772.00 వద్ద ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64,858.00 వద్ద ప్రారంభమై, రూ.65,136.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,190.00 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు రూ.2,259.00 (-3.43%) క్షీణించి రూ.63561.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న భారీగా క్షీణించినప్పటికీ, నేడు మాత్రం స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 10.15 (0.59%) డాలర్లు పెరిగి 1736.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.298 (1.28%) డాలర్లు పెరిగి 23.567 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి.
అంతర్జాతీయంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు అమెరికా జాబ్ డేటా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే, పెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను ఊహించిన దాని కంటే ముందుగానే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రధానంగా పసిడి పైన పడింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు మరింత క్షీణించింది. అంతకుముందు ఓ సమయంలో ఏకంగా 1684 డాలర్ల స్థాయికి కూడా దిగి వచ్చింది. వెండి ఔన్స్ ధర 23 డాలర్లకు పతనమైంది. బంగారం బలహీన సంకేతాలు మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని లేదా స్థిరంగా కొనసాగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం 1788 డాలర్ల దిగువనే మరికొంతకాలం ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 1665 డాలర్ల వద్ద కీలక మద్దతు ఉంది.
శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం అమెరికా కంపెనీలు ఇటీవల చాలామందిని ఉద్యోగాల్లో నియమించుకున్నాయి. గత ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ నియామకాలు జూలైలో జరిగినట్లుగా డేటా వెల్లడిస్తోంది. అలాగే, వేతనాలు కూడా పెరిగిన సంకేతాలు కనిపించాయి. అలాగే, అమెరికా టెన్ ఇయర్ ట్రెజరీ యీడ్ల్స్, డాలర్‌కు డేటా బూస్ట్ వంటి అంశాలు బంగారంపైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR వద్ద శుక్రవారం నాటికి బంగారం నిల్వలు 1,025.28 టన్నులకు పడిపోయాయి. అంతకుముందు రోజు అంటే గురువారం 1,027.61 టన్నులు నమోదయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications