బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో క్రితం సెషన్‌లో ఓ సమయంలో 1950 డాలర్లకు చేరువైంది. నేడు తగ్గినప్పటికీ అది అతి స్వల్పం మాత్రమే. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో మొన్న రూ.51,000కు సమీపంలో, సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.65,000 సమీపంలో ముగిసింది. నిన్న శివరాత్రి పర్వదినం సందర్భంగా బులియన్, స్టాక్ మార్కెట్‌కు సెలవు. కాబట్టి నిన్న ట్రేడింగ్ లేదు. నిన్నటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే గోల్డ్ ఫ్యూచర్స్ 44 డాలర్లు పెరిగింది. నేడు మాత్రం అతి స్వల్ప తగ్గుదల లేదా స్థిరంగా ఉంది. దీంతో దేశీయంగా ధరలు రూ.52,000కు చేరువయ్యాయి. వెండి ధరలు రూ.67,000కు చేరుకున్నాయి.

రూ.52,000కు సమీపంలో గోల్డ్ ఫ్యూచర్స్
ఎంసీఎక్స్‌లో నేడు ఉదయం గం.10.30 సమయానికి ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.51,870 వద్ద ట్రేడ్ అయింది. జూలై గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,024 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.143 క్షీణించి రూ.66,856 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.239 తగ్గి రూ.67,940 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌ల గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.52,000 క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్ కూడా కిలో రూ.67,000 క్రాస్ చేసింది.

భారీగా పెరిగి, స్వల్ప తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1945 డాలర్లకు చేరువైంది. కానీ నేడు స్వల్పంగా తగ్గి 1940 డాలర్ల దిగువన ఉంది. నేటి ప్రారంభ సెషన్‌లో 4.65 శాతం క్షీణించి 1939 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.264 డాలర్లు క్షీణించి 25.2777 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఏడాదిలో 11.58 శాతం పెరిగింది. క్రితం సెషన్‌లో 1944 డాలర్ల వద్ద క్లోజ్ కాగా, నేడు ఏకంగా 1947 డాలర్లకు పైన ట్రేడింగ్ ప్రారంభించింది. కానీ ఆ తర్వాత కాస్త శాంతించింది

మరింత పెరగవచ్చు
రష్యా ఉక్రెయిన్ సిటిజన్లను కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో యుద్ధ భయాలు తగ్గడం లేదు. ఇది అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది. ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం చూపుతాయి. వివిధ దేశాల్లో ద్రవ్యోల్భణం పెరుగుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications