తగ్గిన పసిడి ధర: ఇతర కరెన్సీ ఇన్వెస్టర్లకు బంగారం కాస్త ఖరీదు
రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు (మే 12) పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో కూడా ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.28 శాతం పెరిగి రూ.45,911 పలికింది. జూలై సిల్వర్ కిలో 0.23 శాతం పెరిగి రూ.43,328 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా దేశాలు ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఇతర కరెన్సీల ఇన్వెస్టర్లకు కాస్త ఖరీదు
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరల్లో దాదాపు ఎలాంటి మార్పు లేదు. ఔన్స్ ధర 1,695.75 డాలర్లు పలికింది. ఆరు దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ రెండు వారాల గరిష్టానికి చేరుకుంది. దీంతో ఇతర కరెన్సీ ఇన్వెస్టర్లకు బంగారం కాస్త ఖరీదుగా మారింది. ఇతర ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 1.2 శాతం పడిపోయి 15.36 డాలర్లు పలికింది. ప్లాటీనమ్ 0.3 శాతం ఎగిసి 758.98 పలికింది.

రూ.46,100 వద్ద కొనుగోలు చేయవచ్చు
అంతర్జాతీయ వ్యాప్తంగా కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ అలాగే కొనసాగే అవకాశం ఉంది. కరోనా పుట్టిన చైనాలోని వూహాన్‌లో, జర్మనీ, సౌత్ కొరియా వంటి ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఆందోళనలు కనిపిస్తున్నాయి. బంగారం అస్థిరంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారంను రూ.46,100 వద్ద కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

మార్కెట్లో ధర
ఇక హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 వరకు తగ్గి రూ.44,200 పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 వరకు పడిపోయి రూ.47,000కు దిగి వచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ.350, 24 క్యారెట్ల బంగారం 330 క్షీణించింది.


Click it and Unblock the Notifications