రూ.48,000 దాటిన బంగారం ధర: మద్దతు ధర, నిరోధకస్థాయి ఇక్కడే
బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అయితే ఫెడ్ రిజర్వ్, ఒమిక్రాన్ ప్రభావంపై మరింత స్పష్టత కోసం గోల్డ్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే గత కొద్దిరోజులుగా గోల్డ్ ఫ్యూచర్ పెరుగుతున్నప్పటికీ, అది మందకోడిగా సాగుతోంది. అయితే ఎట్టకేలకు డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000ను క్రాస్ చేసింది. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగే సూచనలు ఉంటాయని భావించినప్పటికీ, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటుండటంతో నెమ్మదిగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.62 పెరిగి రూ.48,122 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,218 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ 1800 డాలర్లకు దిగువనే ఉన్నాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 3.85 (+0.22%) డాలర్లు పెరిగి 1788.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో స్థిరంగా ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.100 తగ్గి రూ.61,728 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.37 క్షీణించి రూ.62,380 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.031 డాలర్లు క్షీణించి 22.495 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8000 తక్కువగా ఉంది.

ఇక, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1772-1758 డాలర్లు. నిరోధకస్థాయి 1800-1812 డాలర్లు. వెండి మద్దతు ధర 22.30-22.00 డాలర్లు. వెండి నిరోధకస్థాయి 22.84-23.10. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47800-47660. నిరోధకస్థాయి రూ.48220-48400. వెండి మద్దతు ధర రూ.61400-61000. నిరోధకస్థాయి రూ.62100-62600.


Click it and Unblock the Notifications