For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: బంగారం ధరలు పెరిగాయి కానీ, రూ.47500 దిగువకు

|

బంగారం ధరలు శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. ఈ వారం పసిడి పెరుగుతూనే ఉంది. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు నేడు మళ్ళీ పెరిగాయి. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.80 పెరిగి రూ.47,484 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.47,500 దిగువకు పడిపోయింది. నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ ఈ మార్కుకు దిగువనే ఉంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.113 పెరిగి రూ.47,650 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5 డాలర్లకు పైగా పెరిగింది. నేటి సెషన్‌లో 5.35 డాలర్లు లేదా 0.30 శాతం లాభపడి 1787.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1782 డాలర్ల వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8700 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 285 డాలర్ల వరకు తక్కువగా ఉంది. పండుగ డిమాండ్ నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65000 క్రాస్ చేసింది. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.154 లాభపడి రూ.65,167 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.203 పెరిగి రూ.65,843 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్లను సమీపించింది. నేటి ప్రారంభ సెషన్‌లో 0.092 డాలర్లు లాభపడి 24.262 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Gold Prices Today: Yellow metal likely to remain volatile amid rising festival demand

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,200. నిరోధకస్థాయి రూ.47,700గా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.47,999 టార్గెట్ ధరతో రూ.47,300 వద్ద కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. రూ.46,900 టార్గెట్ ధరతో రూ.47100 వద్ద విక్రయించవచ్చునని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు 1,772-1,758 డాలర్లు, నిరోధకస్థాయి 1,794-1,808 డాలర్లు, సిల్వర్ మద్దతు ధర రూ.23.94-23.70 డాలర్లు, నిరోధకస్థాయి 24.44-24.70 డాలర్లు.

English summary

Gold Prices Today: బంగారం ధరలు పెరిగాయి కానీ, రూ.47500 దిగువకు | Gold Prices Today: Yellow metal likely to remain volatile amid rising festival demand

Gold inched higher in the morning trade in the Indian market and was poised for a second weekly gain on October 22, as a softer dollar provided some respite against higher US bond yields and rising expectations that central banks could begin easing economic support.
Story first published: Friday, October 22, 2021, 10:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X