దాదాపు నెల రోజులుగా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. అంతకుముందు వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు రష్యా వ్యాక్సీన్ వచ్చిన అనంతరం భారీగా పడిపోయాయి. ఆ తర్వాత స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ట్రెండ్స్ ప్రకారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి లోయెర్ టాప్ ఔన్స్ 2001 నుండి 2024 డాలర్లు, డౌన్ ట్రెండ్ 1908 డాలర్లుగా ఉండవచ్చునని చెబుతున్నారు. పొటెన్షియల్ రెసిస్టాంట్ 1954.80 అంచనా వేస్తున్నారు. షార్ట్ టర్మ్ రేంజ్ 2089 నుండి 1874, రీట్రేస్మెంట్ జోన్ 1981 నుండి 2007గా అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు విశాఖ, హైదరాబాద్‌లో ఈ రోజు ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగి 22 క్యారెట్ల పసిడి రూ.48,900, 24 క్యారెట్ల బంగారం రూ.53,300 పైన పలికింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.48,150 పైన, 24 క్యారెట్ల పసిడి రూ.52,500 పైన పలికింది. కేరళలో 22 క్యారెట్ల పసిడి 46,700, 24 క్యారెట్ల పసిడి రూ.50,960 పలికింది.

అమెరికాలో పెరిగిన ఉద్యోగిత రేటు, డాలర్ వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పైన ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. శుక్రవారం దేశీయ ఎంసీఎక్స్‍లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధర తగ్గి రూ.50,690 వద్ద నిలిచింది. వరుసగా మూడో రోజు ధరలు క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీ రూ.56,200 గరిష్ట ధరతో రూ.5,500కు పైన తక్కువగా ఉంది. నెల రోజుల్లో పసిడి ధరలు పది శాతం తగ్గాయి.


Click it and Unblock the Notifications