బంగారం ధరలు ఈ వారం తీవ్ర ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. పెరిగినట్లే పెరిగి, అంతలోనే తగ్గుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.51,000 స్థాయిలో ఉండగా, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ధరలు రూ.1850 డాలర్లకు పైన ఉన్నాయి. క్రితం సెషన్‌లో 1870 డాలర్లను క్రాస్ చేసినప్పటికీ ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పటికీ, అంతకుముందు భారీగా పెరిగాయి.
ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ ధరలు క్రితం సెషన్లో రూ.285 తగ్గి రూ.50,984 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.251 తగ్గి రూ.51,265 వద్ద ముగిశాయి. వెండి ధరలు కూడా క్రితం సెషన్లో రూ.676 తగ్గినప్పటికీ, రూ.61,660 వద్ద ముగిసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,660 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.629 తగ్గి రూ.62,384 వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే బంగారం ధరలు రూ.5300 తక్కువగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 17 డాలర్లు లేదా దాదాపు 1 శాతం క్షీణించి 1853.90 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.335 డాలర్లు లేదా 1.50 శాతం తగ్గి 21.940 డాలర్ల వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 220 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications