ముంబై: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే గుడ్‌న్యూస్. మళ్లీ చాలా రోజుల తర్వాత 10 గ్రాముల ధరలు రూ.50,000 దిగువకు వచ్చాయి. ఆగస్ట్ 7వ తేదీన రష్యా కరోనా వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో ఆ తర్వాత ధరలు ఈ మార్కు కిందకు వచ్చాయి. ఆ తర్వాత రూ.49వేల నుండి రూ.52వేల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రూ.50వేల పైన ఉన్న ధరలు ఇప్పుడు దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా కేసులు తగ్గి, రికవరీలు పెరగడం, వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పుడు రూ.6,200 కంటే తక్కువ ఉంది.

రూ.50,000 దిగువకు పసిడి ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి సాయంత్రం సెషన్ సమయానికి రూ.348.00 (-0.69%) క్షీణించి రూ.49,977.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,200.00 ప్రారంభమైన ధర, రూ.50,200.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,720.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గత వారం రూ.51వేలుగా ఉన్న ధర రూ.50వేల దిగువకు వచ్చింది. రూ.వెయ్యి వరకు తగ్గింది. గత వారం రూ.1200 తగ్గింది. అంటే ఈ రెండు వారాల్లో రూ.2000కు పైగా తగ్గింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.364.00 (-0.72%) క్షీణించి 10 గ్రాములు రూ.50009.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,197.00 ప్రారంభమై, రూ.50,244.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,772.00 కనిష్టాన్ని తాకింది.

భారీగా తగ్గిన వెండి ధర
వెండి ధర రూ.వెయ్యికి పైగా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో
1,127.00 (-1.80%) క్షీణించి రూ.61,416.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,091.00 వద్ద ప్రారంభమై, రూ.62,182.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,710.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.1,194.00 (-1.85%) క్షీణించి రూ.63,200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,983.00 వద్ద ప్రారంభమై, రూ.64,023.00 గరిష్టాన్ని, రూ.62,582.00 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం వారం రూ.64వేలుగా ఉన్న పసిడి ఇప్పుడు రూ.61,500 దిగువకు వచ్చింది.

1860 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1860 డాలర్ల దిగువకు వచ్చింది. కామెక్స్‌లో 14.25 (-0.76%) తగ్గిన పసిడి 1,859.65 డాలర్లు పలికింది. 1,850.45 - 1,872.60 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,873.90 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో బంగారం 25 శాతం వరకు పెరిగింది.
ఔన్స్ వెండి 0.436 (-1.78%) డాలర్లు క్షీణించి 24.017 డాలర్లు పలికింది. 23.672 - 24.422 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.448 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో దాదాపు 40 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!



Click it and Unblock the Notifications