Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.50,500 దిగువకు
బంగారం ధరలు భారీగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000 దిగువకు, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,800 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1840 డాలర్ల దిగువకు, వెండి 21.500 డాలర్ల దిగువకు పతనమైంది. పసిడి ధరలు ఈ వారం క్షీణించే అవకాశాలే కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ.50,000 దిగువకు పడిపోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 దిగువకు రావొచ్చు.

రూ.50,000 స్థాయికి బంగారం ధరలు
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.281 తగ్గి రూ.50,678 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.267 క్షీణించి రూ.50,976 వద్ద ముగిసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,750 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,437 వద్ద ముగిసింది.
నేటి సెషన్‌లో పసిడి మరింతగా పడిపోయింది. ఉదయం గం.9.30 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.234 తగ్గి రూ.50,352 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.283 తగ్గి రూ.50,618 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ జూలై ఫ్యూచర్ రూ.329 తగ్గి రూ.60,289 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.323 తగ్గి 61,000 వద్ద ట్రేడ్ అయింది.

భారీగా తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 6.61 డాలర్లు తగ్గి 1835 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 21.425 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1841 డాలర్ల వద్ద ముగిసింది. నేడు మరింత క్షీణించి 1835 డాలర్లకు పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 240 డాలర్ల మేర తక్కువగా ఉంది. ఏడాదిలో దాదాపు 1 శాతం క్షీణించింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 23 శాతం మేర తగ్గింది.

అందుకే ధరలు తగ్గాయి
బంగారం ధరలు మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. అమెరికా ద్రవ్యోల్భణ డేటాకు ముందు పసిడి ధరలు క్షీణించాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ గతవారం ఓవర్ నైట్ లెండింగ్ రేటును అర శాతం పెంచింది. అమెరికా బాండ్ యీల్డ్స్ కూడా భారీగా పెరిగాయి. డాలర్ వ్యాల్యూ పెరుగుతోంది. ఈ ప్రభావం పసిడి పైన కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications