Gold prices today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు నేడు (ఆగస్ట్ 19 గురువారం) స్థిరంగా ఉన్నాయి. నేడు మొహర్రం పండుగ సందర్భంగా ఈక్విటీ మార్కెట్లకు సెలవు దినం. కమోడిటీ మార్కెట్ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు తెరుచుకోదు. అయితే సాయంత్రం గం.5కు కమోడిటీ మార్కెట్ ప్రారంభమయింది. ఏదైనా పర్వదినం రోజు కమోడిటీ మార్కెట్ ఉదయం లేకపోయినప్పటికీ, సాయంత్రానికి ట్రేడింగ్ ఉంటుంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో (సాయంత్రం కమోడిటీ ఓపెన్ అయ్యాక) రూ.18 పెరిగి రూ.47,150 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. నిన్న ఉదయం రూ.63,000 పైన కనిపించిన సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రానికి రూ.62,500 దిగువకు పడిపోయింది. నేటి ప్రారంభ సెషన్లో రూ.200 వరకు తగ్గి రూ.62,285 వద్ద ట్రేడ్ అయింది.
పసిడి ధరలు నిన్నటి సెషన్‌లో ప్రారంభంలో పెరిగినప్పటికీ, సాయంత్రానికి తగ్గాయి. నిన్న అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.140 వరకు క్షీణించి రూ.47,141 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 6.70 డాలర్లు తగ్గి 1,777 డాలర్లకు క్షీణించింది. నేడు కూడా స్థిరంగా ఉన్నాయి.

ఇక, అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు అతి స్వల్పంగా క్షీణించాయి. సాయంత్రం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.45 (0.03%) డాలర్లు క్షీణించి 1,783.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.175 (0.75%) డాలర్లు క్షీణించి 23.247 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రారంభ సెషన్లో పెరిగినట్లుగా కనిపించాయి. కానీ ఆ తర్వాత స్వల్పంగా తగ్గాయి.
అమెరికా డాలర్ నేడు 93.35 వద్ద ట్రేడ్ అయింది. ఇది 0.23 శాతం అధికం. ఇతర కరెన్సీలతో పోలిస్తే 2021లో ఇది భారీగా బలపడింది. టెన్ ఇయర్ యూఎస్ టీ బాండ్ యీల్డ్స్ 4 బేసిస్ పాయింట్లు క్షీణించి 1.22 శాతానికి తగ్గాయి. అంతర్జాతీయ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 2.04 శాతం తగ్గి 1,015.10 టన్నులకుతగ్గింది. ఈటీఎఫ్ మార్కెట్ వ్యాల్యూ 58.19 బిలియన్ డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications