Gold prices today: భారీగా తగ్గిన బంగారం ధర, ఆల్ టైం గరిష్టంతో రూ.9200 డౌన్
బంగారం ధరలు నేడు(సెప్టెంబర్ 7, మంగళవారం) భారీగా తగ్గాయి. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.47,500 స్థాయిలో ప్రారంభమైంది. అయితే నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు మాత్రం భారీగా పడిపోయింది. నేడు ప్రారంభ సెషన్లో రూ.47,400 దిగువకు వచ్చింది. అయితే సాయంత్రానికి అంతకంటే పతనమై రూ.47,000 కిందకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9250 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు 1830 డాలర్ల నుండి 1800 డాలర్ల దిగువకు పడిపోయాయి. సోమవారం ఆసియా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ దేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. ఈ ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన పడింది.
నేడు రూ.47,402.00 వద్ద ప్రారంభమైన అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,435.00 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.46,864.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సాయంత్రం గం.10.00 సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.463.00 (-0.98%) తగ్గి రూ.46962.00 వద్ద ట్రేడ్ అయింది. అయితే అంతకుముందు ఓ సమయంలో రూ.600 వరకు కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఏకంగా 36 డాలర్లకు పైగా తగ్గింది. సాయంత్రం సెషన్‌లో 36.45 (-1.99%) డాలర్లు క్షీణించి 1,797.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ ఫ్యూచర్ నేటి ప్రారంభ సెషన్లో రూ.65092కు పెరిగింది. అయితే సాయంత్రానికి తగ్గి రూ.65,000 దిగువకు వచ్చింది. రూ.663 తగ్గిన డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.64,629 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.415 (-1.67%) డాలర్లు క్షీణించి 24.387 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications